VIDEO: 'మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి'
ADB: డ్రగ్స్, గంజాయి వంటి చెడు అలవాట్లకు ప్రజలు దూరంగా ఉండాలని తెలంగాణ సాంస్కృతిక కళాబృందం సభ్యులు తెలిపారు. శనివారం ఇంద్రవెల్లి మండలంలోని మామిడిగూడ గ్రామంలో కళాజాత ప్రదర్శన నిర్వహించారు. రోడ్డు భద్రత నియమాలు, వేసవికాలంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రభుత్వ పథకాలు తదితరాంశాలపై ప్రజలకు అవగాహన కల్పించారు.