గూడూరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

గూడూరు పట్టణంలో ఘోర రోడ్డు ప్రమాదం

TPT: గూడూరు పట్టణంలోని బనికిసాహేబ్ పేట ప్రాంతం కూడలి వద్ద శుక్రవారం సాయంత్రం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న ఓ మహిళను లారీ అతివేగంతో ఢీ కొనడంతో రెండు కాళ్లు నుజ్జు నుజ్జు అయ్యాయి. సమాచారం అందుకున్న గూడూరు ఒకటవ పట్టణం ఎస్సై తిరుపతయ్య సంఘటనా స్థలానికి చేరుకుని మహిళను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.