మండలంలో భారీ భూకబ్జాను అడ్డుకున్న అధికారులు
KDP: బద్వేల్ నియోజకవర్గం కాశినాయన మండలంలో భారీ భూకబ్జాను గురువారం ఆర్డీవో చంద్రమోహన్, పోలీసులు అడ్డుకున్నారు. మూలపల్లి పంచాయతీ సర్వే నెంబర్-1లో 100 ఎకరాలకుపైగా భూకబ్జాదారులు చదును చేస్తున్నారన్నారు. 2 హిటాచీలు, ఒక జేసీబీ, ఒక టిప్పర్ సీజ్ చేశారు. పూర్తి విచారణ చేసి రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా తహసీల్దార్‌కు ఆర్డీవో ఆదేశాలు ఇచ్చారు.