ప్రజా వినతులు స్వీకరించిన ఎమ్మెల్యే

ELR: దుగ్గిరాల క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కూటమి నాయకులు, అధికారులు, ప్రజలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. పలు గ్రామాల ప్రజల నుంచి ఎమ్మెల్యే వినతులు స్వీకరించారు. ఎప్పటి నుంచో వస్తున్న పెన్షన్ నిలిపివేశారని, పెన్షన్ పైనే బ్రతికే తమను ఆదుకోవాలని ఎమ్మెల్యేని కోరగా, సత్వరమే రీ వెరిఫికేషన్ చేయాలని అధికారులను ఆదేశించారు.