VIDEO: శివాలయంలో పౌర్ణమి పూజలు

CTR: పుంగనూరు పట్టణం కోనేటి పాళ్యం సమీపంలో శ్రీ కాశీ విశ్వేశ్వర స్వామి ఆలయంలో పౌర్ణమి సందర్భంగా బుధవారం రుద్రాభిషేకాలు జరిగాయి. ఉదయాన్నే అర్చకులు లింగానికి పాలు, పసుపు, విభూదిలతో అభిషేకాలు నిర్వహించారు. తర్వాత అలంకరించి ధూప దీప నైవేద్యాలను సమర్పించారు. ఆలయానికి విచ్చేసిన భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలను అందుకున్నారు.