విద్యార్థుల ఫీజు చెల్లించిన పూర్వ విద్యార్థి

విద్యార్థుల ఫీజు చెల్లించిన పూర్వ విద్యార్థి

NLG: చిట్యాల మండలంలోని నేరడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి చదువుతున్న విద్యార్థులకు ఆ పాఠశాల పూర్వ విద్యార్థి కాసోజు శంకరాచారి పదవ తరగతి పరీక్ష ఫీజు చెల్లించారు. 10వ తరగతి చదువుతున్న 35 మంది విద్యార్థులకు పబ్లిక్ పరీక్షల ఫీజు నిమిత్తం ఒక్కొక్కరికి 125 రూపాయల చొప్పున మొత్తం 4375 రూపాయలు పాఠశాల ప్రధానోపాధ్యాయులు రామ్మోహన్ కు ఇవాళ అందజేశారు.