స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్రలో పాల్గొన్న ఎమ్మెల్యే

E.G: తాళ్లపూడి మండలం అన్నదేవరపేట గ్రామంలో ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఇవాళ నిర్వహించిన 'స్వచ్ఛ ఆంధ్ర - స్వర్ణాంధ్ర' కార్యక్రమంలో కొవ్వూరు ఎమ్మెల్యే ముప్పిడి వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆసుపత్రి వద్ద ఎమ్మెల్యే మొక్కలు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని పరిరక్షించాలని పిలుపునిచ్చారు. అలాగే పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని సూచించారు.