సుంకేసులకు స్వల్పంగా పెరిగిన వరద

KRNL: సుంకేసుల జలాశయానికి వరద ప్రవాహం స్వల్పంగా పెరిగింది. శనివారం 20 వేల క్యూసెక్కులు ఇన్ ఫ్లో ఉండగా ఆదివారం ఉదయానికి 32 వేల క్యూసెక్కులు నీరు జలాశయంలోకి వస్తుందని జలాశయం ఇంజినీర్ మహేంద్రరెడ్డి పేర్కొన్నారు. జలాశయంలో 1.110 టీఎంసీల నీరు నిల్వ ఉండటంతో 7 గేట్లు మీటరు ఎత్తులో తెరచి నది దిగువకు 30,653 క్యూసెక్కులు విడుదల చేస్తున్నామన్నారు.