భక్తి శ్రద్ధలతో రంజాన్ వేడుకలు
NLR: బుచ్చి మండలంలో రంజాన్ పండుగను ముస్లిం సోదరులు ఘనంగా జరుపుకున్నారు. మండలంలోని పలు మసీదు ప్రాంగణాల్లో ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున తరలివచ్చి భక్తి శ్రద్ధలతో నమాజ్ ఆచరించారు. ఇమామ్ అహ్మద్ రజా రంజాన్ సందేశాన్ని సోదరులకు వివరించారు. సందేశాన్ని ఆసక్తిగా ఆలకించి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఒకరికొకరు ఆలింగం చేసుకొని రంజాన్ శుభాకాంక్షలు తెలుపుకున్నారు.