అప్పుల బాధతో రైతు ఆత్మహత్య

NLR: కోవూరు 16 నెంబర్ హైవే గానుగపెంట గ్రామ పంట పొలాల వద్ద కలిగి శశిధర్ రెడ్డి (46) అనే రైతు అప్పుల బాధతో పురుగుల మందు తాగి గురువారం ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.