ఉగ్రవాదానికి భారత్ తలొంచదు: మోదీ
పహల్గామ్‌లో ఉగ్రదాడి జరిగి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ప్రధాని మోదీ ఎక్స్ వేదికగా పోస్టు చేశారు. ‘పహల్గామ్ దాడిలో మరణించిన అమాయకులను ఎన్నటికీ మరిచిపోము. వారిని స్మరించుకుందాం. ఆ దాడిలో కుటుంబ సభ్యులను కోల్పోయిన వారికి నా సానుభూతి. ఉగ్రవాదం ఏ రూపంలో ఉన్నా భారత్ తలొగ్గదు. వారి కిరాతక కుట్రలు ఎప్పుడూ సఫలం కాలేవు’ అని పేర్కొన్నారు.