జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ
AP: జిల్లాల పునర్విభజనపై కేబినెట్ సబ్ కమిటీ భేటీ అయ్యింది. ఈ సమావేశానికి మంత్రులు నాదెండ్ల, అనగాని, నిమ్మల, బీజీ జనార్దన్ రెడ్డి హాజరయ్యారు. అలాగే, మంత్రులు నారాయణ, సత్యకుమార్ వర్చువల్‌గా హాజరయ్యారు. జిల్లాలు, డివిజన్లు, మండలాలు, గ్రామాల పేర్లు, మార్పులు, చేర్పులపై చర్చించారు. ఈనెల 10న కేబినెట్ సమావేశంలో జిల్లాల పునర్విభజనపై నిర్ణయం తీసుకోనున్నారు.