రోడ్డు పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే
KDP: పొద్దుటూరులోని 16వ వార్డులో రూ. 35 లక్షల అంచనాతో రోడ్డు పనులకు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజుల రెడ్డి ఇవాళ భూమి పూజ నిర్వహించారు. ఈ సందర్బంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. నాణ్యతతో పనులు చేపట్టాలని ఇంజనీరింగ్ అధికారులు, కాంట్రాక్టర్లకు సూచించారు. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ ముక్తియార్ పాల్గొన్నారు.