ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

ఇంటర్ ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ

కర్నూల్: గూడూరు మండలంలోని జూలకల్లు ఆదర్శ జూనియర్ కళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరం ప్రవేశానికి విద్యార్థుల నుంచి దరఖాస్తుల స్వీకరించనున్నట్లు ప్రిన్సిపాల్ దిల్షాద్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. 2024-25 విద్యా సంవత్సరంలో ఇంటర్ మొదటి ఏడాది ప్రవేశానికి పదవ తరగతి విద్యార్థులు ఈనెల 28వ తేదీ నుంచి మే నెల 22వ తేదీ వరకు ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు.