నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ కిట్ల పంపిణీ
GDWL: మానవపాడులో అల్-ఖైర్ మైనారిటీ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో నిరుపేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందజేశారు. కమిటీ సభ్యులు చందాలు పోగుచేసి సుమారు 50 కిట్లను సిద్ధం చేసి సోమవారం పంపిణీ చేశారు. నిరుపేదలు కూడా ఆనందంగా పండుగ జరుపుకోవాలనే లక్ష్యంతో ఈ కార్యక్రమం చేపట్టామని కమిటీ అధ్యక్షుడు అన్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో మసీదు ముతవల్లి మహేబూబ్ ఉన్నారు.