VIDEO: కంటైనర్‌ను ఢీకొన్న లారీ.. తప్పిన పెను ప్రమాదం
ADB: గుడిహత్నూర్ మండలం సీతాగొంది జాతీయ రహదారిపై మంగళవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. నాగపూర్ వైపు వెళ్తున్న కంటైనర్‌ను వెనుక నుంచి లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ క్యాబిన్‌లోనే ఇద్దరు చిక్కుకున్నారు. స్థానికులు అతి కష్టం మీద వారిని బయటికి తీశారు. తీవ్ర గాయాలైన వారిద్దరిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.