సీఎం పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్
GNTR: ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 16వ తేదీన తుళ్లూరులో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, పోలీస్ సూపరింటెండెంట్ వకుల్ జిందాల్ శనివారం ఏర్పాట్లను పరిశీలించారు. అమరజీవి పొట్టి శ్రీరాములు జయంతి వేడుకలలో భాగంగా తుళ్లూరులో ముఖ్యమంత్రి హాజరవనున్నారు. తుళ్లూరులో ఆర్యవైశ్య ట్రస్టుకు ప్రభుత్వం 6.8 ఎకరాలు కేటాయించిన విషయం తెలిసిందే.