'సూర్య ఘర్ యోజన పోస్టర్ ఆవిష్కరణ'

శ్రీకాకుళం: ప్రధాన మంత్రి సూర్య ఘర్ యోజన పోస్టర్లను మంగళవారం కలెక్టర్ ఆయన ఛాంబర్‌లో ఆవిష్కరించారు. తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ సూపరింటెండెంట్ ఇంజినీర్ నాగిరెడ్డి, ఇతర ఇంజినీర్లు పాల్గొన్నారు. పథకంలో భాగంగా ఇంటిపై రాయితిలో సోలార్ రూఫ్ ఏర్పాటు చేసుకోవచ్చని అన్నారు. దీని ద్వారా కరెంట్ బిల్లు తగ్గుతుందని పేర్కొన్నారు.