టీటీడీ ట్రస్టులకు రూ. 20 లక్షల విరాళం

టీటీడీ ట్రస్టులకు రూ. 20 లక్షల విరాళం

TPT: హైదరాబాద్‌కు చెందిన సృజన్ జ్యూవెలరీ అధినేత శ్రీ రవికుమార్ ఇవాళ టీటీడీ ట్రస్టులకు రూ. 20 లక్షల విరాళాన్ని సమర్పించారు. శ్రీవారి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్ట్‌కు రూ.10 లక్షలు, ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్‌కు మరో రూ. 10 లక్షలను విరాళంగా ఇచ్చారు. భక్తి శ్రద్ధలతో విరాళం అందించిన దాతకు టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు హృదయపూర్వక అభినందనలు తెలిపారు.