గజపతినగరంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ

VZM: గజపతినగరంలో హెల్మెట్ పై అవగాహన ర్యాలీ జరిగింది. బొబ్బిలి డీఎస్పీ శ్రీనివాసరావు పర్యవేక్షణలో సోమవారం సర్కిల్ పరిధిలో గల ఎస్ఐలు, మహిళా పోలీసులు పోలీసు సిబ్బంది హెల్మెట్ ధరించి ద్విచక్ర వాహనాలపై అవగాహన ర్యాలీ చేశారు. పోలీస్ స్టేషన్ నుంచి పెట్రోల్ బంక్ వరకు ర్యాలీ జరిపారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించాలని సూచించారు. ఎస్ఐలు లక్ష్మణరావు మహేష్ పాల్గొన్నారు.