జగనన్న కాలనీలో ఎమ్మెల్యే ఇంటూరి పర్యటన

జగనన్న కాలనీలో ఎమ్మెల్యే ఇంటూరి పర్యటన

NLR: మొంథా తుఫాన్ ప్రభావంతో కందుకూరు పట్టణం మహాదేవపురం వద్ద గల జగనన్న కాలనీలో నీట మునిగిన ప్రాంతాలను ఎమ్మెల్యే ఇంటూరి నాగేశ్వరరావు బుధవారం ట్రాక్టర్‌లో పర్యటించారు. ఇందులో భాగంగా ప్రజల సమస్యలను తెలుసుకుని తక్షణ సహాయ సహకారాలు అందించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం "ఎవరూ అధైర్య పడవద్దు, ప్రభుత్వం అండగా ఉంటుంది" అని ఎమ్మెల్యే భరోసా ఇచ్చారు.