విద్యార్థులకు సన్నబియ్యంతో భోజనం

అనకాపల్లి జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్నం భోజన పథకంలో భాగంగా స్కూల్స్, కాలేజీలు, సంక్షేమ హాస్టల్స్‌లో సన్న బియ్యంతో భోజనం ప్రారంభించినట్లు కలెక్టర్ విజయ్ కృష్ణన్ తెలిపారు. గురువారం కలెక్టరెట్లో ఆమె మాట్లాడారు. జిల్లా వ్యాప్తంగా 1,418 ప్రభుత్వ పాఠశాలలు,136 ఎస్సీ, ఎస్టీ, బీసీ సంక్షేమ హాస్టళ్లకు 16,898కేజీల నాణ్యమైన సన్న బియ్యం బస్తాలను పంపిణీ చేశామన్నారు.