పోలింగ్ కేంద్రాలను సందర్శించిన MPDO
VKB: మోమిన్‌పేట మండలంలో రెండో విడుత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది. ఇందులో భాగంగా మండల పరిధిలోని చక్రంపల్లి పోలింగ్ స్టేషన్‌ను ఎంపీడీవో సృజన సందర్శించారు. ఈ మేరకు పోలింగ్ సరళిని తెలుసుకున్నారు. ఈ మండలంలో మొత్తం 29 గ్రామపంచాయతీలు ఉన్నాయి. అందులో ప్రస్తుతం 25 గ్రామపంచాయతీలకు పోలింగ్ జరుగుతుండగా.. మరో 4 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవమయ్యాయి.