ORRపై నేడు శాసనమండలిలో ప్రశ్నలు అడగనున్నMLC
NTR: MLC మొండితోక అరుణ్ బుధవారం శాసనమండలిలో అమరావతి ఔటర్ రింగ్ రోడ్ (ORR) నిర్మాణంపై ప్రశ్నలు అడగనున్నారు. ఈ మేరకు లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ఎస్.ప్రసన్నకుమార్ వివరాలు వెల్లడించారు. ORR నిర్మించేందుకు NTR జిల్లాలో భూసేకరణ ప్రక్రియ, రైతులకు ఇచ్చే నష్టపరిహారంపై అరుణ్ అడిగిన ప్రశ్నలకు సంబంధిత మంత్రి జనార్ధనరెడ్డి సమాధానం ఇవ్వాల్సి ఉంటుంది.