ములుగులో మండల సమావేశం
MLG: ములుగు జిల్లాలో ప్రజా పాలన- ప్రగతి ప్రణాళికలో భాగంగా గురువారం ములుగులో మండల స్థాయి సమావేశం నిర్వహిస్తున్నట్లు ఇంఛార్జ్ ఎంపీడీవో రహీముద్దీన్ తెలిపారు. మండల అభివృద్ధి కార్యక్రమాలపై శాఖల వారీగా ప్రణాళికలు సమర్పించనున్నారు. 18 విభాగాలకు చెందిన అధికారులు ఉదయం 10:30లోగా డీఎంహెచ్‌వో మీటింగ్ హాలుకు హాజరుకావాలని కోరారు.