VIDEO: యూరియా కోసం రైతుల పడిగాపులు

JNM: పాలకుర్తి మండల కేంద్రంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఎదుట బుధవారం రైతులు యూరియా కోసం బారులు తీరారు. యూరియా కోసం అన్ని పనులు వదిలిపెట్టి కార్యాలయానికి రావాల్సి వస్తుందని, ఇక్కడికి వస్తే రెండు బస్తాలే ఇస్తున్నారని, అవి కూడా సరిపోవడం లేదని రైతులు తెలిపారు. అధికారులు స్పందించి రైతులకు సరిపడా యూరియాను అందించాలని అన్నదాతలు వేడుకుంటున్నారు.