ఖేల్ ఇండియా అభివృద్ధిపై ఎమ్మెల్యే కీలక సమీక్ష
E.G: ఖేల్ ఇండియా అభివృద్ధిపై జరిగిన కీలక సమీక్ష సమావేశానికి రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ హాజరయ్యారు. యువ క్రీడాకారులకు అవకాశాలు కల్పించడం, ప్రతి మండలంలో క్రీడా మౌలిక వసతుల వేగవంతమైన అభివృద్ధిపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. క్రీడలు యువత భవిష్యత్తుకు ముఖ్యం అని, సదుపాయాలన్నీ త్వరగా పూర్తి చేసి, మరింత ప్రతిభను ముందుకు తేవాలని అధికారులను సూచించారు.