నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

నిరుపేద కుటుంబాలకు ఆర్థిక సాయం

కడప: సిద్దవటం మండలంలోని మాధవరం -1, కొత్త మాధవరం గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబాలకు రాజంపేట జనసేన పార్టీ నేత మలిశెట్టి వెంకటరమణ శుక్రవారం ఆర్థిక సాయం చేశారు. కొత్త మాధవరం గ్రామానికి చెందిన మధు 3 నెలల క్రితం రోడ్డు ప్రమాదానికి గురై మృత్యువాత పడ్డారు.ఆయన కుటుంబానికి రూ.10 వేలు మాధవరం-1 గ్రామాలకు చెందిన శ్రావణి కుటుంబానికి రూ.10వేల చెక్కులను అందజేశారు.