స్విమ్మింగ్ పూల్‌లో ఏనుగు జలకాలాట

వేసవి తాపానికి మనుషులతో పాటు మూగజీవాలు కూడా అల్లాడిపోతున్నాయి. ఈ ఎండ తీవ్రతను తట్టుకోలేక ఓ ఏనుగు స్విమ్మింగ్ పూల్‌లో జలకాలాడింది. తమిళనాడు రామేశ్వరంలోని రంగనాథస్వామి ఆలయానికి చెందిన రామలక్ష్మి అనే ఏనుగు వేడిని తట్టుకులేక ఈత కొలనులో దొర్లుతూ సేదదీరింది. రామలక్ష్మి ఈత కొలనులో జలకాలడిన దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి.