ITDA POకు సమ్మె నోటీసు అందజేసిన ఔట్సోర్సింగ్ ఉద్యోగులు

BDK: భద్రాచలం గిరిజన సంక్షేమ శాఖ పోస్టుమెట్రిక్ హాస్టల్‌లో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ గిరిజన కార్మికులకు 10 నెలలుగా జీతాలు లేవు. జీతాలు చెల్లించాలని ఎన్నిసార్లు అధికారులకు విన్నవించిన ఫలితం లేదన్నారు. ఈ నేపథ్యంలో తాము సమ్మె చేస్తున్నామని ఐటీడీఏ పీవోకు సీఐటీయు ఆధ్వర్యంలో పీఎంహెచ్ హాస్టల్ ఔట్సోర్సింగ్ వర్కర్స్ యూనియన్ మంగళవారం సమ్మె నోటీసు అందజేశారు.