చార్మినార్ ముత్యాలకే కాదు.. అత్తర్‌కు ప్రసిద్ధే.!

చార్మినార్ ముత్యాలకే కాదు.. అత్తర్‌కు ప్రసిద్ధే.!

HYD: చార్మినార్ పరిసరాలు ముత్యాలు, లక్కగాజులకే కాకుండా సువాసనలు వెదజల్లే అత్తర్‌కు కూడా ప్రసిద్ధే. నిజాం పాలకుల కాలం నుంచి అత్తర్‌ను వేడుకలు, శుభకార్యాల్లో వినియోగించడం సంప్రదాయంగా వస్తోంది. ముస్లింలు మసీదులు, ఈద్గాలకు వెళ్లేటప్పుడు నూతన వస్త్రాలు ధరించడంతో పాటు అత్తర్‌ను పూసుకుంటారు. ఈదుల్ ఫితర్ రోజున ముస్లింలు ముబారక్ అంటూ అత్తర్ పూసి సంప్రదాయంగా పలకరిస్తారు.