అధ్యాపక పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానం

వనపర్తి : జిల్లాలోని నాలుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో అతిథి అధ్యాపకుల పోస్టులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా ఐడీ ప్రిన్సిపల్ రఘునందన్ బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. వనపర్తిలోని ప్రభుత్వ (కో ఎడ్యుకేషన్), మహిళా, పెబ్బేర్ ప్రభుత్వ, ఆత్మకూర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో ఖాళీలు ఉన్నట్లు పేర్కొన్నారు.