తిరుపతి జిల్లాలో తల్లి, భార్య హత్య

తిరుపతి జిల్లాలో తల్లి, భార్య హత్య

TPT: నారాయణవనం(M) వెంకటకృష్ణపాలెం చాకలి వీధిలో విషాదం చోటు చేసుకుంది. గ్రామానికి చెందిన మోహన్ తన భార్య, తల్లిని హత్య చేసినట్లు స్థానికులు ఆరోపించారు. అనంతరం నిందితుడు కొడుకు, కుమార్తెతో పరారయ్యాడు. ఫోన్ స్విచ్ ఆఫ్ అవ్వడంతో అతనితో ఉన్న పిల్లల పరిస్థితిపై బంధువులు ఆందోళన చెందుతున్నారు. మోహన్ ఆచూకీ కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.