'రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలి'

NGKL: వైద్యులు, సిబ్బంది రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి రవికుమార్ సూచించారు.పెద్దముద్దునూరు PHCని బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఆసుపత్రిలో రికార్డులు, హాజరు పట్టికను పరిశీలించారు. అంకితభావంతో విధులు నిర్వహిస్తూ సమయపాలన పాటించాలని ఆసుపత్రి సిబ్బందికి ఆయన సూచించారు.