'మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలి'

HYD: తెలంగాణలో జరగనున్న 72వ మిస్ వరల్డ్ పోటీలను రద్దు చేయాలని మిస్ వరల్డ్ అందాల పోటీలు వ్యతిరేక వేదిక డిమాండ్ చేసింది. ఈ మేరకు ఉస్మానియా యూనివర్సిటీలోని ఆర్ట్స్ కాలేజ్ ఆవరణలో సోమవారం నిరసన తెలిపారు. మహిళల ఆత్మ గౌరవానికి భంగం కలిగించే ఈ పోటీలు దేనికి ప్రతీక అని ప్రశ్నించారు. కాంగ్రెస్ ప్రభుత్వం కార్పొరేట్ అవతారం ఎత్తి మార్కెట్ విస్తరణ కోసమే ఈ పోటీలు నిర్వహిస్తుందన్నారు.