జీసీసీ బంక్‌లో పెట్రోలు, డీజిల్ కొరత

జీసీసీ బంక్‌లో పెట్రోలు, డీజిల్ కొరత

ASR: జీకే వీధి మండలం సీలేరు జీసీసీ పెట్రోల్ బంక్‌లో గత రెండు రోజులుగా పెట్రోలు, డీజిల్ కొరత ఏర్పడడంతో వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. ధారకొండ, గుమ్మిరేవులు, దుప్పిలివాడ తదితర మారుమూల గ్రామాల ప్రజలు ఈ బంక్‌పైనే ఆధారపడి ఉంటున్నారు. ఇక్కడి నుంచి ఇంధనం కొనుగోలు చేసి గ్రామాల్లో విక్రయాలు కూడా నిర్వహిస్తున్నారు. దీనిపై అధికారులు స్పందించాలని కోరుతున్నారు.