రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి

ELR: కొయ్యలగూడెంలోని పులివాగు శివాలయం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో సలీం అనే వ్యక్తి మృతి చెందారు. జంగారెడ్డిగూడెం నుంచి వస్తున్న కోళ్ల వ్యాన్, మార్గమధ్యంలో ఆగి ఉన్న లారీని వెనుక నుంచి ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో డ్రైవర్ గిరి గాయపడగా, క్యాబిన్‌లో ఇరుక్కుపోయిన క్లీనర్ సలీం అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఎస్సై చంద్రశేఖర్ ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు.