రామవరప్పాడు సర్పంచ్ సస్పెన్షన్ రద్దు
NTR: రామవరప్పాడు గ్రామ సర్పంచ్ వరి శ్రీదేవి సస్పెన్షన్‌ను న్యాయస్థానం రద్దు చేసింది. పంచాయతీ నిధుల్లో రూ. 4.04 కోట్ల అవినీతి జరిగిందనే ఆరోపణలతో వారం రోజుల క్రితం ఆమెను విధుల నుంచి సస్పెండ్ చేశారు. అయితే ఈ నిర్ణయాన్ని సవాలు చేస్తూ కోర్టును ఆశ్రయించగా, సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ వెంటనే బాధ్యతలు స్వీకరించాలని న్యాయస్థానం ఆదేశాలు శనివారం జారీ చేసింది.