బాసరలో సీఎం మనువడి అక్షరాభ్యాసం
NRML: బాసర క్షేత్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తన మనువడు రేయాన్స్ రెడ్డికి అక్షరాభ్యాసం చేయించారు. సోమవారం సతీమణి గీతా రెడ్డితో కలిసి అమ్మవారిని దర్శించుకున్న సీఎం, ఆలయ పండితులు సంజీవ్ ఆధ్వర్యంలో వేడుక నిర్వహించారు. మనువడిని ఒడిలో కూర్చోబెట్టుకుని పలకపై ఓనమాలు దిద్దించారు. అనంతరం గర్భగుడిలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు.