ఖరీఫ్ ప్రణాళికపై రైతులకు అవగాహన

ఖరీఫ్ ప్రణాళికపై రైతులకు అవగాహన

SKLM: సరుబుజ్జిలి మండలం పెద్దపాలెంలో వికసిత్ కృషి సంకల్ప అభియాన్ కార్యక్రమం బుధవారం జరిగింది. ఖరీఫ్ సీజన్ ముందస్తు ప్రణాళికపై శాస్త్రవేత్త సంధ్యరాణి రైతులకు అవగాహన కల్పించారు. ఎరువులు యాజమాన్యం, పచ్చిరొట్ట ఎరువుల వినియోగాన్ని రైతులకు తెలియజేశారు. నేల ఆరోగ్యంపై దృష్టి సారిస్తే పంటలు దిగుబడి అధికంగా ఉంటుందన్నారు.