వేల ఎకరాల వ్యవసాయ భూమి మాయం
కాశ్మీర్ 1996-2023 మధ్య కాలంలో నిర్మాణ, వాణిజ్య ప్రాజెక్టుల వల్ల సుమారు 34 వేల హెక్టార్ల వ్యవసాయ భూమిని కోల్పోయినట్లు ఓ ప్రభుత్వ నివేదిక తెలిపింది. దీంతో నికర సాగు 1,63,000 హెక్టార్ల నుంచి 1,29,000 హెక్టార్లకు చేరింది. భూమి తగ్గడం, ఎక్కువ మంది రైతులు పండ్ల తోటలు, వ్యవసాయేతర పనులలోకి మారడం వల్ల.. దిగుమతి చేసిన ఆహార ధాన్యాలపై ఆధారపడే పరిస్థితి పెరగవచ్చని నివేదిక పేర్కొంది.