'సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి'

VKB: తాండూరు మున్సిపల్ కమిషనర్ విధుల్లో చేరిన రెండో రోజే పట్టణంలో పర్యటించారు. సాయిపూర్లోని 11వ వార్డులో పర్యటించి, సీజనల్ వ్యాధుల నివారణకు చర్యలు చేపట్టారు. వార్డులో మురుగు కాలువలు, వాటర్ ట్యాంకుల నిర్వహణను పరిశీలించి, చెత్తను తొలగించే పనులను పర్యవేక్షించారు. దోమల నివారణకు మున్సిపల్ సిబ్బందితో మందులు పిచికారీ చేయించారు.