పోలీసుల అదుపులో హత్య కేసు నిందితుడు?

VZM: కొత్తవలస(M) ముసిరాం గ్రామంలో జరిగిన హత్య కేసులో పరారీలో ఉన్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు భోగట్టా. ఈనెల 5న సిమ్మ అప్పారావును నాటుతుపాకీతో కాల్చి హత్య చేసి పరారైన విషయం తెలిసిందే. పోలీసులు ప్రత్యేక బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఎట్టకేలకు నిందితుడిని కశింకోటలో అదుపులోకి తీసుకున్నారని సమాచారం. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.