గంజాయి నియంత్రణకు విస్తృత వాహన తనిఖీలు

విశాఖ: గంజాయి నియంత్రణలో భాగంగా హోంమంత్రి అనిత ఆదేశాల మేరకు పెందుర్తి పోలీసులు పినగాడి సెంటర్ వద్ద వాహనాలను విస్తృతంగా తనిఖీలు చేపట్టారు. వాహనదారులను ఎక్కడి నుంచి ఎక్కడికి ప్రయాణం చేస్తున్నారని ఆరా తీశారు. ఏజెన్సీ ప్రాంతం నుంచి నగరంలోకి విచ్చలవిడిగా గంజాయి సప్లై అవుతున్న నేపథ్యంలో ఈ వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు.