మహిళా భద్రతే లక్ష్యంగా శక్తి టీం బృందాల అవగాహన
సత్యసాయి: మహిళా భద్రతే లక్ష్యంగా శక్తి టీం బృందాలు విస్తృత అవగాహన కల్పిస్తున్నాయి. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన కార్యక్రమాల్లో ‘శక్తి’ యాప్ వినియోగంపై విద్యార్థినులు, మహిళలకు ప్రత్యక్షంగా డెమో ఇచ్చారు. ఆపద సమయంలో ఈ యాప్ ద్వారా తక్షణమే పోలీసు సాయం పొందవచ్చని, లైవ్ లొకేషన్ ఆధారంగా వేగంగా స్పందన లభిస్తుందని వివరించారు.