విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

విజయనగరం ఆర్టీసీ ఈడీగా మాధవీలత బాధ్యతల స్వీకారం

VZM: విజయవాడ ఆర్టీసీ మార్కెటింగ్ విభాగం నుంచి పదోన్నతి పొందిన మాధవీలత విజయనగరం రీజినల్ నూతన ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె రీజినల్ ఛైర్మన్ సియ్యారి దొన్నుదొరను కలిసి పలు కీలక అంశాలపై చర్చించారు. రీజినల్‌లో బస్సుల కొరత, ప్రయాణికుల ఇబ్బందులు, కార్మికులు-సిబ్బంది సమస్యల పరిష్కారంపై దృష్టి సారించారు.