విరిగిన విద్యుత్ స్తంభంతో తీవ్రభయాందోళన

విరిగిన విద్యుత్ స్తంభంతో తీవ్రభయాందోళన

ELR: ముసునూరు గ్రామం నుంచి గోపవరం గ్రామానికి వెళ్లే ప్రధాన రహదారి వెంట విద్యుత్ స్తంభం విరిగిపోవడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఈ రహదారిలో వేలాది వాహనాలు సంచరిస్తుంటాయని, వ్యవసాయ పనుల నిమిత్తం రైతులు రేయింబవళ్లు వాహనాలపై వెళుతుంటారని తెలిపారు. అధికారులు సకాలంలో స్పందించి విరిగిన విద్యుత్ స్తంభాన్ని తొలగించాలని కోరారు.