గందరగోళంగా కొండపల్లి కౌన్సిల్ సమావేశం

గందరగోళంగా కొండపల్లి కౌన్సిల్ సమావేశం

NTR: మైలవరం నియోజకవర్గం కొండపల్లి మున్సిపాలిటీలో కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశంలో వైసీపీ సభ్యులు ప్రజా సమస్యలు, ఇంటి పన్నుల పెంపు, తాగునీటిలో బూడిద కలవడంపై ప్లకార్డులు ప్రదర్శించారు. పోడియం ముందు బైఠాయించి మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై ప్రశ్నించడంతో వైసీపీ, టీడీపీ సభ్యుల మధ్య తీవ్ర వాగ్వాదం నెలకొంది.