కాంగ్రెస్ పార్టీకి భారీ ఎదురుదెబ్బ
NRPT: స్థానిక ఎన్నికల వేళ నర్వ మండలంలో అధికార కాంగ్రెస్ పార్టీకి షాక్ తగిలింది. పార్టీ పట్టణ ప్రెసిడెంట్ వావిళ్ల వెంకటేశ్వర రెడ్డి, మక్తల్ నియోజకవర్గ యువజన కాంగ్రస్ కార్యదర్శి రామన్‌గౌడ్ కాంగ్రెస్‌కు రాజీనామా చేశారు. పార్టీలో తమకు తగిన గుర్తింపును ఇవ్వడం లేదని పేర్కొన్నారు. ఈ మేరకు తమ రాజీనామా లేఖలను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడికి అందజేసినట్లుగా వారు తెలిపారు.