రింతాడలో రక్తదాన శిబిరం

రింతాడలో రక్తదాన శిబిరం

ASR: ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ ఆధ్వర్యంలో శనివారం జీకేవీధి మండలం రింతాడలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. శిబిరంలో 32 యూనిట్ల రక్తాన్ని సేకరించి రెడ్ క్రాస్ సొసైటీకి అప్పగించామని ఉప సర్పంచ్ సోమేష్ కుమార్, పెసా కమిటీ కార్యదర్శి రాజేష్ కుమార్ తెలిపారు. రక్తదానం చేసేందుకు ప్రజలు ముందుకు రావాలని డీటీ సత్యనారాయణ తదితర అధికారులు పిలుపునిచ్చారు.